![]() |
![]() |

పులిని చూస్తే చాలు గుండె ఎవ్వరికైనా గుభేలుమంటుంది. ఈ పులి మీద జూనియర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగలో ఎవర్ గ్రీన్ డైలాగ్ ఉంటుంది "పులిని దూరం నుంచి చూడాలనిపించిందనుకో చూసుకో...పులితో ఫోటో దిగాలనుకో కొంచెం రిస్కైనా పర్లేదు ట్రై చేయొచ్చు..." ఈ డైలాగ్ రియల్ గా జరిగితే ఆహా ఆ ఆనందమే వేరు కదా. మరి అలాంటి ఆనందాన్ని చిన్మయి అనుభవించింది. ఇక బండిలో కూర్చుని నవ్వుతూ పులితో ఫోటో కూడా దిగింది చిన్మయి.
ఆ పులి కూడా ఫోటోకి ఫోజిచ్చింది. కెన్యాలోని మాసాయి మారాలో స్టార్ వొయిర్స్ వాళ్ళు ఈ నెల 13 - 18 వరకు ఏర్పాటు చేసిన మ్యూజికల్ స్టార్ గేజింగ్ వైల్డ్ లైఫ్ టూర్ కి చిన్మయి వెళ్ళినప్పుడు అక్కడ దిగిన ఫోటోని ఇలా తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది. ఇక ఈ ఫోటోకి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్ని కామెంట్స్ లో ఒక కామెంట్ మాత్రం చాలా క్యూట్ గా ఉంది.." పులితో ఫోటో దిగే ముందు నువ్వు దాని కోసం ఒక పాట పాడి ఉంటావ్ అందుకే అది సైలెంట్ గా కూర్చుంది" అంటూ కామెంట్ చేశారు. ఇక పవర్ ఫుల్ పులితో ఆడపులి..రెండు పులులు..ఒకే ఫ్రేమ్ లో రెండు పవర్ఫుల్ అంటూ నెటిజన్స్ చిన్మయిని పొగిడేస్తున్నారు. "జిరాఫీలకు దగ్గరగా వాకింగ్, సింహంతో దగ్గరగా ఫోటోలు దిగడం ...ఇది చాలా అద్భుతంగా ఉంటుందని నేనస్సలు ఊహించలేదు." అంటూ ఒక కాప్షన్ పెట్టుకుంది. ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూ మీద ఫైర్ అయ్యే చిన్మయిని అంతా ఫైర్ బ్రాండ్ అని పిలుస్తారు. అలాంటి ఫైర్ బ్రాండ్ ఇలా నేచర్ ని ఎంజాయ్ చేస్తోంది.
![]() |
![]() |